బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో గురువారం దారుణం జరిగింది. నగరానికి చెందిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇది యువతి కుటుంబికులకు నచ్చలేదు. గురువారం సాయంత్రం తన ప్రియుడికి యువతి ఫోన్ చేసింది. తన తండ్రికి గుండెపోటు వచ్చిందని చెప్పింది. వారి ఇంటికి వెళ్లిన యువకుడిని ఆమె కుటుంబికులు కొట్టి, దోచుకున్నారు. తర్వాత అతడి ప్రైవేట్ పార్ట్స్ కత్తితో కోసేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు.