మొత్తం 125 దేశాల ఆకలి సూచీ జాబితాలో భారత్ 111వ స్థానంలో నిలిచింది. గోధుమ పిండి కోసం తొక్కిసలాట జరుగుతున్న పాకిస్థాన్ (102వ స్థానం), ఎవరైనా కొంచెం ఆర్థిక సాయం చేయకపోతారా అని ఎదురుచూస్తున్న శ్రీలంక (60), తలసరి ఆదాయంలో భారత్ కు సుదూరంలో ఉన్న బంగ్లాదేశ్ (81), నేపాల్ (69) కూడా తాజా ప్రపంచ ఆకలి సూచీలో ఇండియాకంటే మెరుగ్గా ఉన్నాయి. భారత్ లో నిజంగా ఆ స్థాయిలో ఆకలికేకలున్నాయా..? అని విశ్లేషకులు అభ్రిపాయపడుతున్నారు.