ఏ దేశాల్లో ఆకలి సమస్య ఎంత ఉందో చెప్పేందుకు ఏటా ఆకలి సూచీని విడుదల చేస్తారు. దీనికోసం నాలుగు అంశాలను ప్రధానంగా పరిగణిస్తారు. ప్రజలు ఎన్ని కేలరీలను తీసుకుంటున్నారు. ఐదేళ్లలోపు పిల్లల పొడవు, బరువు, మరణాల సంఖ్య. ఈ నాలుగింటి ఆధారంగా 100 పాయింట్లకు దేశాల ర్యాంకింగ్ లను నిర్ధారిస్తారు. ఒక్క పాయింట్ కూడా రాని దేశం అగ్రస్థానంలో ఉన్నట్లు. 100 పాయింట్లు వస్తే అత్యంత ఘోరమైన పరిస్థితి ఉన్నట్లు లెక్క.