విశాఖ-భీమిలి బీచ్ రోడ్డులో తిమ్మాపురం వద్ద యూనిటీ మాల్ ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ప్రధాన రహదారిని ఆనుకుని కేటాయించిన ఐదెకరాల్లో కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన రూ.172 కోట్లతో యూనిటీ మాల్ ను నిర్మించనున్నారు. ఇందులో స్థానిక హస్త కళాకారులకు, చేతివృత్తిదారులకు స్టాళ్లు కేటాయిస్తారు. ఈ ప్రాంతాన్ని శుక్రవారం ఇన్వెస్ట్ ఇండియా ప్రతినిధులు సోనియా దుహనా, ఆకాంక్ష, తదితరులు సందర్శించారు.