నెల్లూరు జిల్లాలోని 8 నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..... నియోజకవర్గాల్లోని సమస్యలను తెలుసుకున్నాం. క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి సమస్యలు తెలుసుకున్నాం. నియోజకవర్గ సమీక్షలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. రాబోవు ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులపై సీఎం వైయస్ జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని విజయసాయిరెడ్డి వెల్లడించారు.