విమానాన్ని దోమలు అడ్డుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును, అక్టోబర్ 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెక్సికోలోని వోలారిస్ ఫ్లెట్ గువాడలహార నుంచి మెక్సికో సిటీకి ఉ.4.30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. ఒక్కసారిగా దోమల గుంపు విమానంలోకి ప్రవేశించడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో విమాన సిబ్బంది స్ప్రేలు కొడుతూ చెమటోడ్చారు. ఈ కారణంగా విమానం దాదాపు 3గంటలు ఆలస్యం అయ్యింది.