నాన్ రెసిడెంట్ ఆంధ్రులే (ఎన్ఆర్ఏ) ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతున్నారని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఇక్కడ నుంచి జీవితం ప్రారంభించిన రామోజీరావు విశాఖపై విషం చిమ్ముతున్నారు. అమరావతిలో పెట్టుబడులు పోతాయని ఇలా రామోజీ చేస్తున్నారు. పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ నాన్ లోకల్. ఇప్పుడు చంద్రబాబు జైల్లో వున్న 30 రోజులు మినహాయిస్తే నాలుగేళ్లలో ఎప్పుడైనా వారం రోజులు ఆంధ్రప్రదేశ్లో వున్నారా?’’ అంటూ మంత్రి గుడివాడ ప్రశ్నించారు.