తత్వవేత్త, నోబెల్ బహుమతి పొందిన తొలి భారత ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్. 1988లో ఇదే రోజున ఆయనను నోబెల్ వరించింది. సంక్షేమ అర్థశాస్త్రం ద్వారా సమాజంలోని అసమానతలను తొలగించేందుకు సేన్ ఎనలేని కృషి చేశారు. పేదరికం, నిరుద్యోగం, సంక్షోభాలను అర్థశాస్త్ర పరంగా విశ్లేషించి పరిష్కార మార్గాలు చూపారు. ఆయన అధ్యయనాలు ఇతర దేశాలకూ ఉపయోగపడ్డాయి. ప్రపంచ ఖ్యాతి గాంచిన సేన్ భారత పౌరసత్వాన్ని వదులుకోని దేశభక్తుడు.