స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో సాక్షిగా తమ ముందు ఈ నెల 16న విచారణ కు హాజరుకావాలని సీఐడీ తనకు నోటీసులిచ్చిందని.. విచారణ సందర్భంగా సీఐడీ తనను అరెస్టు చేస్తుందనే ఆందోళన ఉందని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కిలారు రాజేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో కిలారు రాజేశ్‌ని నిందితుడిగా చేరిస్తే సీఆర్‌పీసీ 41ఏ నిబంధనలు అనుసరిస్తామని, సీఐడీ హైకోర్టుకు లిఖితపూర్వకంగా తెలియజేసింది. ఈ వివరాలు నమోదు చేసిన న్యాయస్థానం.. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులూ అవసరం లేదని పేర్కొంది.