మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిన్‌కు సంబంధించి పూర్తిగా పరీక్షించామని, ట్రీట్మెంట్పై సూచనలు రాసిచ్చామని రాజమహేంద్రవరం జీజీహెచ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సునీతాదేవి తెలిపారు. ప్రీక్లీ హీట్ (చెమట పొక్కులు)లా వచ్చిందని, వైద్యం అంతా జైలులోని మెడికల్ ఆఫీసర్లు చూస్తారని చెప్పారు. రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండులో ఉన్న చంద్రబాబుకు గురువారం సాయంత్రం పరీక్షలు చేసిన ఆమె శుక్రవారం జీజీహెచ్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సెంట్రల్ జైలు మెడికల్ ఆఫీసర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ మేరకు హెచ్‌వోడీ డాక్టర్ సూర్యనారాయణతో కలసి జైలులోకి వెళ్లాం. చంద్రబాబును పరీక్ష చేసి తగిన సూచనలు ఇచ్చాం అని తెలిపారు.