పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో వెలసి ఉన్న ప్రముఖ శక్తి పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అమ్మవారు నేడు బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కో అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారని ఆలయ ఈవో చంద్రమౌళి తెలియజేశారు. ఆలయంలో ఉదయం నుంచి భక్తుల తాకిడి నెలకొంది.