రామకుప్పం మండలం పంద్యాలమడుగు పంచాయతి కావలి మడుగు గ్రామంలో గత నెలరోజులుగా త్రాగునీరు లేక ఇబ్బందు పడుతున్నామని గ్రామస్తులు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. తాగు నీరు లేక వ్యవసాయ పొలాల వద్ద తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు కోరుతున్నారు.