రాజంపేట మండలంలోని కొమ్మి వారి పల్లెకు చెందిన రమణయ్య 45 అనే వ్యక్తి మద్యం మత్తులో గడ్డి మందు తాగి మృతి చెందినట్లు మన్నూరు పోలీసులు తెలిపారు. రమణయ్య నిత్యం మద్యం తాగుతూ ఉండేవాడు. ఈనెల తొమ్మిదిన మద్యం మత్తులో గడ్డి మందు తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు ఆయన్ని తిరుపతి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.