ఘర్షణలో ఇద్దరు యువకులు కత్తి పోట్లకు గురయ్యారు. నాదెండ్ల మండలం సాతులూరుకి చెందిన మన్నేపల్లి పవన్ కుమార్, బాబు, నాగరాజు, అంకమ్మలు స్నేహితులు. ఐతే పవన్ కుమార్ కు, బాబుకు మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. బాబు అక్కడి నుంచి తప్పించుకోగా ఆగ్రహించిన పవన్ కుమార్ మీ వల్లనే బాబు తప్పించుకున్నాడని అంకమ్మ, నాగరాజులపై కత్తితో దాడి చేశాడు. ఘటనపై పోలీసులు శనివారం కేసునమోదు చేశారు.