గుర్తు తెలియని వృద్ధుడు శనివారం రాత్రి గుంటూరు జిజిహెచ్‌లో మృతి చెందాడు. గుంటూరు నగరం అరండల్ పేట 12వ లైన్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న వృద్ధుడుని స్థానికులు 108 వాహనం ద్వారా జిజిహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు శనివారం మృతి చెందాడు. మృతుని వివరాలు తెలిసినవారు 8688831332 నంబర్‌కు సంప్రదించాలని అరండల్ పేట సీఐ రామానాయక్ కోరారు.