మళ్లీ రాష్ట్రానికి జగనే సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. అక్కయ్యపాలెం కళ్యాణ మండపంలో శనివారం విశాఖ ఉత్తర నియోజకవర్గం గృహ సారథులు సచివాలయ కన్వీనర్లతో నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత సంక్షేమ పథకాలు కొనసాగించడానికి జగన్ మళ్లీ సీఎం కావాలన్నారు.