గేయ రచయిత స్వర్గీయ జాలాది రాజారావు చిరస్మరణీయులని నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి పేర్కొన్నారు. శనివారం జాలాది రాజారావు 12వ వర్ధంతి సందర్భంగా బీచ్ రోడ్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. జాలాది రాజారావు గొప్ప కవి, గేయ రచయిత, స్క్రిప్ట్ రైటర్ అని కొనియాడారు. ఆయన చిన్నతనంలో వివక్షతకు గురయ్యారని తన రచనలు చాలావరకు పేద సామాజిక వర్గంపై ఉండేవని తెలిపారు.