నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నగర మేయర్ హరి వెంకట కుమారి అన్నారు. శనివారం 9వ వార్డు పరిధిలోని విశాలాక్షి నగర్ నందు సంజయ్ నగర్ కాలనీలో రూ. 34 లక్షల వ్యయంతో తారు రోడ్డు నిర్మాణానికి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, వార్డ్ కార్పొరేటర్ కోరుకొండ స్వాతి దాస్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు