కొమరాడ మండలం సుందరాపురం, డంగభద్ర గ్రామాల మధ్య ఒంటరి ఏనుగు హరి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు శనివారం గుర్తించారు. దీంతో సమీప గ్రామాల ప్రజలందరినీ అప్రమత్తం చేశారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రజలు ఎవరు ఒంటరిగా తిరగరాదని సూచించారు. అలాగే ఏనుగు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దన్నారు. రైతులు తమ పశు సంపదను వ్యవసాయ క్షేత్రాలలో ఉంచరాదని సూచించారు.