విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు దర్శించుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు జరిపిన వారు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రాన్ని ఆలయ ఈవో, ఛైర్మన్ గవర్నర్ దంపతులకు అందజేశారు.