నా ఫోన్ కాల్ ని రికార్డ్ చెయ్యాల్సిన అవసరం ఏంటి అని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తపరిచారు. అయన మాట్లాడుతూ.... నాకు రోజూ చాలా మంది ఫోన్ చేస్తుంటారు. దాదాపు అన్ని కాల్స్ నేను అటెండ్ చేస్తాను. నిన్న రాత్రి 9.30కి వచ్చిన కాల్‌ను లిఫ్ట్ చేస్తే.. తాను చంద్రబాబు అభిమానినంటూ ఒకరు నాతో మాట్లాడారు. జైల్లో బాబు అనారోగ్యం పాలయ్యారని, కాబట్టి ఆయనను ఎలాగైనా బయటకు తీసుకురావాలంటూ.. ఏడుస్తూ మాట్లాడాడు. ఆ ప్రచారం అసత్యమని, జైల్లో బాబు ఆరోగ్యంగానే ఉన్నారని, అయినా ఆయన్ను బయటకు తీసుకురావడం తన చేతిలో లేదని చెప్పాను. ఒకవేళ బాబు నిజంగా జైల్లో అనారోగ్యం పాలైతే, వారు కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పాను. దాంతో ఆ వ్యక్తి సమాధానపడి ఫోన్ పెట్టేశాడు. కానీ ఆ తర్వాత చూస్తే.. నా ఫోన్‌కాల్ మాటలు మీడియాలో ప్రసారం అయ్యాయి. అంటూ.. ఒక ఛానల్‌లో ప్రసారమైన తన ఫోన్ కాల్ మాటలను ఈ సందర్భంగా మంత్రి మీడియాకు చూపించారు. మరి ఆ కాల్ చేసింది ఎవరు? టీడీపీ నేతలా? లేక బాబు కుటుంబ సభ్యులా? ఎవరు చేయించినా.. నేను అటెండ్ చేసిన కాల్‌ను ఎలా రికార్డు చేశారు? ఆ హక్కు వారికెవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు.