ఉద్దేశ్యపూర్వకంగానే జగన్ ప్రభుత్వం చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా కుట్రపన్నుతోంది అని శిష్ట్లాఅన్నారు.చంద్రబాబును కేసులతో వేధించడమే కాకుండా మానసికంగా క్షోభ పెట్టి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. చంద్రబాబును తక్షణమే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లాలి. తెలుగుదేశం కార్యకర్తల సహనం నశించక ముందే ప్రభుత్వం తన తప్పు సరిచేసుకోకపోతే పరిస్థితి మరోలా ఉంటుంది అని హెచ్చరించారు.