కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు లో ఈనెల 19న సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఎస్పీ సీతారామయ్య తదితరులు వైడబ్య్లూసీఎస్ మైదానం, హెలీప్యాడ్ ప్రాంతాలను పరిశీలించారు. జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా సీఎం జగన ఎమ్మిగనూరుకు వస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మైదానం పరిశీలన కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, సీఐలు మధుసుధనరావు, మోహనరెడ్డి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.