చంద్రబాబు కు జైలులో ఎలాంటి సౌకర్యాలు లేకుండా చేసి జగన్ రాక్షసానందం పొందుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా విమర్శించారు. చంద్రబాబు వయసు మీదపడటంతో బరువు తగ్గారని, డీహైడ్రేషన్, చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ఉమా తెలిపారు. ఆ సమస్యలేవీ లేవని సజ్జల రామకృ ష్ణారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారని, వైద్యులు నిర్ధారించి చెప్పా ల్సిన విషయాన్ని సజ్జల ఎలా చెబుతారని, అతనికి ఏ అర్హత ఉందని ఉమా ప్రశ్నించారు. తక్షణమే చంద్రబాబుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేసారు.