ముంబైకి చెందిన సయ్యద్ తాహిర్ (65) 40 ఏళ్ళ క్రితం స్థానిక డోంగ్రీ ప్రాంతంలో ఓ హత్యాయత్నం చేశాడు. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసినా బెయిల్పై వచ్చి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. అతను హైదరాబాద్ వచ్చి టోలిచౌకి ప్రాంతంలో తలదాచుకున్నాడు. అక్కడి న్యాయస్థానం అతడిపై స్టాండింగ్ వారెంట్ జారీ చేయడంతో మహారాష్ట్ర పోలీసులు ఎట్టకేలకు అతడి ఆచూకీ కనిపెట్టారు. శుక్రవారం సిటీకి వచ్చిన ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసింది.