ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 2023 ఫ్లాగ్షిప్ ఈవెంట్ 'ది బిగ్ బిలియన్ డేస్' అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం మొదటి 4 రోజుల్లోనే దాదాపు 4 మిలియన్లకు పైగా ప్యాకేజీలను కస్టమర్లకు డెలివరీ చేసింది. హోమ్, ఫర్నిషింగ్ అండ్ లైఫ్‌స్టైల్ విభాగాల్లో ఏకంగా 3.5 లక్షల ఉత్పత్తులను అందిస్తోంది. పండుగకు ముందు కాలంతో పోలిస్తే ప్రస్తుతం అమ్మకాలు 6 రెట్లు ఎక్కువయ్యాయని కంపెనీ తెలిపింది.