డబ్బు కోసం ఆన్లైన్లో తన నవజాత శిశువును అమ్మకానికి పెట్టిన ఓ తండ్రిని ఇరాకీ నిఘా వర్గాలు తాజాగా అరెస్ట్ చేశాయి. అతడు ఓ ఐఫోన్ కూడా అమ్మేందుకు యత్నించినట్టు వెల్లడించాయి. బిడ్డ పుట్టి ఆరు రోజులు అయ్యి ఉంటుందని,15 వేల డాలర్లకు (మన కరెన్సీలో సుమారు రూ.12 లక్షలు) శిశువును అమ్మకానికి పెట్టాడని తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.