ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫా వివాదంలో చిక్కుకుంది. పాలస్తీనాకు మద్దతుగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తీవ్ర దుమారం రేపింది. పలు పోర్స్ సైట్స్ ఆమె అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నాయి. తమ సైట్ ద్వారా మియా ఖలీఫాకు వచ్చే ఆదాయాన్ని తాము నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఆమె వీడియోల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇజ్రాయెల్ సహాయ నిధికి ఇవ్వనున్నట్లు తెలిపింది.