చంద్రబాబుకు హాని చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. బాబుకు ఏదైనా ప్రమాదం ఉంటే అది కుటుంబసభ్యుల నుంచే ఉంటుందని, బాబు కుటుంబంలోనే దొంగలు ఉన్నారన్నారు. బాబు చుట్టూ దొంగలను పెట్టుకొని ప్రభుత్వంపై బురద చల్లటం సరైన పద్దతి కాదంటూ ఆయన హితవు పలికారు. అక్రమాలు బయటపడినందుకు బాబు కుంగిపోయి బరువు తగ్గి ఉంటారన్నారు.