అమ్మ చేయి పసి పిల్లల పొట్ట మీద ఉంటేనే ఆ పిల్లలు నిద్రలోకి జారుకుంటారు. ఆ చేయి పక్కకు జరిగిందో నిద్రలేచి పిల్లలు కేకలు వేస్తారు. అలాంటి సందర్భాల్లో చక్కగా ఉపయోగపడేలా ‘బేబీ స్లీప్ సూతింగ్ పామ్ పిల్లోస్’ మార్కెట్ లోకి వచ్చాయి. ఇవి అచ్చంగా నూలుతో చేసినవి. మనుషుల చేతిని పోలి ఉంటాయి. అంతేకాదు, మీద చేయి వేసినట్టే అనిపించేందుకు కాస్త బరువు జోడించి రూపొందిస్తున్నారు.