టీడీపీ చీఫ్ చంద్రబాబు కేసుకు సంబంధించి CID పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను నవంబర్ 1 కి వాయిదా వేసింది. అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు, నారాయణ క్వాష్ పిటిషన్లపై గతంలో విచారించి తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. తాజాగా, ఈ కేసులపై విచారణకు రీ ఓపెన్ చేయాలని CID పిటిషన్లు వేసింది. అయితే ఇందుకు సంబంధించి అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేస్తామని చంద్రబాబు, నారాయణ తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు.