అసైన్డ్ భూముల కేసులో ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. అమరావతిలో అసైన్డ్ భూముల సేకరణలో చంద్రబాబు, నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని గతంలో కేసు నమోదైంది. దాన్ని కొట్టేయాలంటూ బాబు, నారాయణ వేసిన క్వాష్ పిటిషన్లపై ఇప్పటికే విచారణ ముగియగా.. ధర్మాసనం తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. మరోవైపు కేసు రీఓపెన్ చేయాలంటూ సీఐడీ 2 పిటిషన్లు దాఖలు చేసింది. వాటిపై విచారణను కోర్టు నవంబర్ 1కి వాయిదా వేసింది.