నార్పల మండలం కేంద్రంలో న్యాయానికి సంకెళ్లు అనే కార్యక్రమంలో భాగంగా సోమవారం టిడిపి నాయకులు చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు మాట్లాడుతూ అవినీతి బురదలో నిండా మునిగిన జగన్ ఆ బురదను అందరికీ అంటించేందుకు పన్నిన కుట్రలో భాగమే స్కిల్ డెవలప్మెంట్ కేసు అని తెలియజేశారు.