ఎస్ కే యూనివర్సిటీలో ఎంఏ అడల్ట్ ఎడ్యుకేషన్ కోర్సును కొనసాగించాలని ఏ ఐ ఎస్ ఎఫ్, ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రధాన గెట్ ముందు సోమవారం రిలే నిరాహారదీక్షలు చేపట్టడం జరిగింది. దీక్షలకు కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు నల్లప్ప సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయస్వామి, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి పరమేష్, నాయకులు రాజు, తదితరులు పాల్గొన్నారు.