రేపల్లె ఆర్డీవో కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి 7 ఫిర్యాదులు వచ్చినట్లు ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి జాన్ పీటర్ తెలిపారు. ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు పంపించి వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించినట్లు ఏఓ తెలిపారు. ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి తెలిపారు.