అనుమానాస్పద మృతికింద సోమవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు. తెనాలి మండలం చిన్నరావూరుకు చెందిన వ్యాపారి పుట్టి పుల్లారావు ఇటీవల మృతి చెందారు. దహన సంస్కారాలు పూర్తయ్యాయి. ఆయన మృతిపై అనుమానాలున్నాయంటూ బంధువులు సోమవారం స్పందనలో ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్టు వన్ టౌన్ సీఐ కె. చంద్రశేఖర్ తెలిపారు. అనారోగ్యంతో మృతి చెంది. ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నట్టు చెప్పారు.