పొన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారి జిబిసి రోడ్డు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదురు గత 2 నెలల క్రితం బిఎస్ఎన్ఎల్ సిబ్బంది కేబుల్ వైర్లు మరమ్మత్తుల నిమిత్తం పెద్ద గుంతలు తీసి తమ పని ముగించుకొని వెళ్ళిపోయారు. ఈ మలుపు ప్రాంతంలో తీసిన గుంతలు ప్రమాదంగా మారాయి. గత నాలుగు రోజుల క్రితం రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు పడి గాయాలపాలయ్యారు. అధికారులు ఈ ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు.