నార్పల మండలంలో ప్రభుత్వ బాలుర పాఠశాలలో మంగళవారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికను నిర్వహించుకున్నారు. 1996-1997 వ సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆత్మీయంగా కలవడం జరిగింది. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికలో ఒకరికి ఒకరు తీపి కబుర్లు చెప్పుకొని కష్టం, సుఖం, పాలుపంచుకోవడం జరిగింది. విద్య నేర్పిన గురువులందరినీ కలుపుకొని అందరూ ఆత్మీయతతో ఆనందంగా ఉత్సాహంగా సన్మానించడం జరిగింది.