అనంతపురం నగరంలోని బళ్లారి రోడ్ లో ఉన్న వికలాంగుల శిక్షణా కేంద్రం ప్రహరీ గోడను మంగళవారం జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ పరిశీలించారు. రూ.15లక్షలతో వికలాంగుల శిక్షణా కేంద్రం ప్రహరీ గోడను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులను ప్రహరీ గోడను జాయింట్ కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం శిక్షణా కేంద్రంలో శిక్షణను కూడా జెసి పరిశీలించారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.