ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ కడప జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గ కార్యదర్శి వేణు గోపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవ ర్స్ యూనియన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..... రాష్ట్ర ప్రభుత్వం ఆటో, మోటర్ వాహన డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐ పెన్షన్లతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. జీవో నెంబర్ 21, 31 లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో నడుపుతున్న ప్రతి ఒక్క డ్రైవర్‌కు వాహనమిత్ర పథకం వర్తించే విధంగా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూని యన నాయకులు మాబ్బాష, శేఖర్, వెంకటేష్, ఆంజి, రవి, ఖాదర్ బాష, నరేష్, రాజేష్, శ్రీనివాసులు, మునస్వామి, తదితరులు పాల్గొ న్నారు.