ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అరికట్టేందుకు అందరు ఏకం కావాలని విభిన్న ప్రతిభావంతుల అనంతపురం జిల్లా అధ్యక్షులు అప్పన్నగారి కుమార్, మాజీ కౌన్సిలర్ వైయూ రామాంజనేయులు పేర్కొన్నారు. పామిడి పట్టణంలోని నిర్వహించిన బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ... వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజలపై ఆర్థికభారం మోపుతోందన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు బనాయిస్తూ బంధిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో నల్లబోతుల శ్రీనివాసులు, వెంకటరమణ, సుంకప్ప, షేర్ఖాన, రామకృష్ణ, బొమ్మా మోహనకృష్ణ, దూదేకుల మహమ్మద్రఫీ తదితరులు పాల్గొన్నారు.