ఖరీఫ్ ధాన్యం సేకరణపై సివిల్ సప్లయిస్ అధికారులు, జిల్లా రైస్‌మిలర్లతో భీమవరం జాయింట్ కలెక్టరు రామ్ సుందర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... జిల్లాలో 314 రైతు భరోసా కేంద్రాల ద్వారా 4 లక్షల 65 వేల 393 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ధాన్యం మద్దతు ధర గ్రేడు ఏ రకం క్వింటా 2,203, సాధారణ రకం క్వింటా 2,183 లుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతి రైతుకు కనీస మద్దతు ధర అందేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 314 రైతు భరోసా కేంద్రాలలో సిబ్బందికి, టెక్నికల్ సిబ్బందికి సాంకేతిక, సాధరణ శిక్షణ పూర్తిచేసి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ధాన్యం సేకరణలో కస్టోడియన్ అధికారుల సేవలు సక్రమంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.