నిఠారీ కేసు నిందితులు నిర్దోషులుగా కోర్టు తీర్పునిచ్చింది. ఈ విషయంపై తలారి పవన్ జల్లడ్ దిగ్భ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ కేసులోని నిందితులను 2015లో ఉరి తీసేందుకు పవన్ ను నియమించారు. మరో గంటలో వారు చనిపోతారు అనగా హైకోర్టు ఆర్డర్‌తో తప్పించుకున్నారని పవన్ తెలిపారు. తలారిగా ఉన్న పవన్ నిర్భయ కేసు దోషులను కూడా ఉరి తీశారు. వీరి కుటుంబం నాలుగు తరాలుగా ఈ వృత్తిలో కొనసాగుతోంది. అప్పట్లో పవన్ ముత్తాత లక్ష్మణ్ రామ్ భగత్ సింగ్ ను ఉరితీసారు.