హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు టిడిపి నాయకుల సమక్షంలో లేపాక్షిలో బుధవారం బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నంది విగ్రహం దగ్గర ప్లకార్డులు ప్రదర్శించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తరువాత అనంతరం పాదయాత్రగా వీరభద్రస్వామి దేవాలయం దగ్గరికి వెళ్ళి, నారా చంద్రబాబు నాయుడు జైలు నుండి తొందరగా విడుదల కావాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.