కబ్జాకు గురువుతున్న అనంత కార్పొరేషన్ కు సంబంధించిన స్థలాలను కాపాడాలని అనంతపురం 12 డివిజన్ వైసిపి కార్పొరేటర్ జనబలం బాబా అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నగరంలో ఉన్న ఏఎంసి భూములు పలుచోట్ల అన్యక్రాంతమవు తున్నాయన్నారు. వాటిపై పాలక వర్గం దృష్టి సారించి, వాటిని స్వాధీనం చేసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అవసరమైతే విద్యార్థులకు క్రీడా ప్రాంగణాలను నిర్మించాలన్నారు.