రాయదుర్గం పట్టణంలోని డ్వామా, ఏపీడి కార్యాలయంలో బుధవారం జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. నేరుగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ (ఎఫ్. ఏ. సీ) కేతన్ గార్గ్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.