ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపుతో పాటు పెన్షనర్లకు 4 శాతం డియర్నెస్ రిలీఫ్‌ను ప్రకటించారు. ఇది జులై 1, 2023 నుంచి వర్తిస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అంతేకాకుండా రైల్వే నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 18 రోజుల బోనస్ అందజేయనున్నట్లు చెప్పారు. ఇక రబీలో 6 పంటలకు కనీస మద్దతు ధర పెంచామన్నారు.