రైల్వే ప్రయాణికులు ముందుగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలను అందించేందుకు ఐఆర్సీటీసీ ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోతో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని ఐదు స్టేషన్లకు మాత్రమే పరిమితం చేసింది. ఐఆర్సీటీసీకి చెందిన ఈ-క్యాటరింగ్ సేవల ద్వారా ప్రయాణికులు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుంటే దానిని జొమాటో సాయంతో ఆయా స్టేషన్లలో వారికి అందజేస్తారు.దీనిని మరిన్ని స్టేషన్లకూ విస్తరించే అవకాశం ఉంది.