అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపేందుకు టెల్ అవీవ్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా బైడెన్ మీడియాతో మాట్లాడారు. గాజా ఆస్పత్రిపై జరిగిన వైమానిక దాడిలో 500 మందికన్నా ఎక్కువ పిల్లలు, పౌరులు మరణించారని, ఈ ఘటన చాలా బాధాకరమని అన్నారు. ఈ దాడి ఇజ్రాయెల్ చేసింది కాదని, వేరే టీం చేసినట్లు అనిపిస్తోందని బైడెన్ అన్నారు.