టీడీపీ అధినేత చంద్రబాబు అనుభవం, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆలోచన ఏపీకి అవసరమని జనసేన నేత నాదేండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకెళ్లబోతున్నామని తెలిపారు. వైసీపీ విముక్త ఏపీ కోసం ప్రజలంతా కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. బుధవారం కోనసీమ జిల్లా కొత్తపేటలో పర్యటించిన ఆయన ప్రమాదవశాత్తు మృతి చెందిన జనసేన కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కులను అందించారు.